జాతీయ మహాసభలకు వితరణ చాటుకున్న తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చెల్లా ఆది లక్ష్మమ్మ ను ఆదర్శంగా తీసుకోవాలి. రైతు సంఘం జాతీయ ఉపాధ్యక్షులు జూలకంటి
ప్రజాలహరి మిర్యాలగూడ ;భూమికోసం భుక్తి కోసం మానవాళి కోసం సాగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం లో భర్తతో పాటుగా అండదండలుగా నిలిచిన చెల్లా ఆదిలక్ష్మిమ్మ తనకు వచ్చే పెన్షన్ ను మహాసభలకు 41, వేల రూపాయలు ఇచ్చి వితరణ చాటుకున్నారు . శుక్రవారం స్థానిక కృష్ణ కాలనీలో తన కుమారుడు చల్లా చంద్రారెడ్డి గృహంలో ఉన్న ఆమె జాతీయ మహాసభల గురించి తెలుసుకొని మహాసభల జయప్రదానికి తనకు వచ్చే పెన్షన్ ను సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రైతు సంఘం జాతీయ నాయకులు జూలకంటి రంగారెడ్డి ని పిలిచి తన పెన్షన్ అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా 102 సంవత్సరాలు వయసు కలిగిన ఆమె తన జ్ఞాపకశక్తిని కోల్పోకుండా పార్టీ స్థితిగతుల పై అడిగి తెలుసుకోవడం జరిగింది. సాయుధ పోరాటం సందర్భంగా అందులో పాల్గొన్న తన భర్త చల్లా సీతారామరెడ్డి ని పోలీసులు నిర్బంధించి జైల్లో పెట్టిన సందర్భంగా తాను ఏమాత్రం బెదరకుండా ధైర్యంతో ఉద్యమానికి పరోక్షంగా సహకరించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం జాతీయ నాయకులు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ నాడు సాగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం దేశానికే మార్గదర్శకమైన దని, ఆ పోరాట ఫలితంగానే వేలాదిమంది పేదలు భూములను దక్కించుకున్నారని, భూ స్వాముల నుండి విముక్తి కలిగిందని ఆయన అన్నారు. ఆ ఉద్యమం పూర్తి నేటి యువతకు ఆదర్శం కావాలని, అన్యాయాన్ని ఎదిరించే గుణం ప్రతి మనిషిలో రావాలని ఆయన ఆకాంక్షించారు. రైతు లేనిదే రాజ్యం లేదన్నది వాస్తవమైన విషయమని ఆ క్రమంలో జాతీయస్థాయిలో జరిగి రైతు మహాసభలకు సహకరించాలని ఆయన కోరారు. నేటి పాలకులు రైతులు మోయలేని ఎరువుల ధరలను పెంచి రైతు వ్యవసాయం చేయ లేని విధంగా విధానాలకు పాలకులు పాల్పడుతున్నారని అన్నారు. జాతీయ స్థాయిలో జరిగే మహాసభల్లో రైతు కు న్యాయం జరిగే విధంగా తీర్మానాలు పోరాట కార్యక్రమాలు రూపొందిస్తారని వారు తెలిపారు.అత్యంత ప్రాధాన్యం కలిగిన ఈ మహాసభలకు ప్రతి ఒక్కరు ఆర్థిక హార్థిక సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చెల్లా ఆదిలక్ష్మమ్మ, కుమారుడు చంద్రారెడ్డి, కోడలు మల్లిక, మనవరాలు దివ్య, మనుమడు దీపక్ రెడ్డి, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బి కార్ మల్లేష్, జిల్లా రైతు సంఘం కార్యదర్శి వీరేపల్లి వెంకటేశ్వరరావు, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు రాగిరెడ్డి మల్లారెడ్డి, సిఐటియు నాయకులు రామ్మూర్తి, లక్ష్మీనారాయణ, శ్రీనివాసరావు టాప్రా సత్యనారాయణ, నాయకులు తదితరులు పాల్గొన్నారు.



