ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం – లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
ప్రజాలహరి మిర్యాలగూడ;మిర్యాలగూడ మండలం కాల్వపెల్లి తండాలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి – BLR గ్రామస్థులు, కాంగ్రెస్ నాయకులు, మహిళల సమక్షంలో ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఇందిరమ్మ చీరలు ధరించిన మహిళలతో కలిసి ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే BLR , పేద, మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు..అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు…అనంతరం కాల్వపెల్లి తండాలోని అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను ఎమ్మెల్యే BLR పంపిణీ చేశారు. స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా ప్రభుత్వ అందించే నిత్యావసర సరుకులు, సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి సులభంగా అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు… ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు, మహిళలు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..



