సాగర్ ఎడమ కాలువ నుంచి 6,000 క్యూసెక్కుల నీటి విడుదల చెరువులు, కుంటలు నింపి తాగు, సాగునీటి అవసరాలు తీర్చడమే లక్ష్యం: ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి – BLR
ప్రజాలహరి మిర్యాలగూడ;మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలకు తాగునీరు, రైతులకు సాగునీరు అందించడంతో పాటు చెరువులు, కుంటలను నింపి భూగర్భ జలాలను పెంపొందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి – BLR తెలిపారు… సాగర్ ఎడమ కాలువపై ఉన్న లిఫ్ట్ గేట్లను ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి స్వయంగా ఎత్తి నీటిని విడుదల చేశారు. పెద్దదేవులపల్లి వద్ద అవుట్‌ఫాల్ రెగ్యులేటర్‌ను ఆన్ చేసి 6,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు… తద్వారా నియోజకవర్గంలోని చెరువులు, కుంటలు నిండేలా నీటిని మళ్లించే చర్యలు చేపట్టారు…అదేవిధంగా మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలోని వజిరాబాద్ మేజర్, కిష్టాపురం మేజర్, ముల్కల కాలువ మేజర్‌తో పాటు తక్కెళ్ళపాడు లిఫ్ట్ గేట్లను ఎమ్మెల్యే ఎత్తి నీటి విడుదలను ప్రారంభించారు…ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి – BLR మాట్లాడుతూ, రైతాంగానికి మేలు చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు.. చెరువులు, కుంటలు, కాలువలను నీటితో నింపడం ద్వారా భూగర్భ జలాలు పెరిగి, నియోజకవర్గ ప్రజలకు తాగునీటి లభ్యత మెరుగుపడటంతో పాటు రైతులకు సాగునీరు అందుబాటులోకి వస్తుందని తెలిపారు..ప్రజల తాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు రైతుల పంటలకు అవసరమైన సాగునీటిని అందించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ప్రతి ప్రాంతానికి నీటి వనరులను అందుబాటులోకి తీసుకువచ్చి రైతులు, ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు నిరంతరం కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు…నీటి విడుదల సక్రమంగా జరిగేలా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని, చివరి ఆయకట్టు వరకు నీరు అందేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు… ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.



