ఘనంగా తెలుగు భాషా దినోత్సవం

ప్రజాలహరి మిర్యాలగూడ;వ్యవహారిక భాష ఉద్యమ పితామహులు ఆచార్య గిడుగు రామ్మూర్తి పంతులు జయంతిని (తెలుగు భాషా దినోత్సవం) వారి చిత్రపటానికి పూలమాలవేసి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జప్తి వీరప్పగూడం నందు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బొలిశెట్టి బిక్షపతి మాట్లాడుతూ గ్రాంథిక భాష రాజ్యమేలుతున్న క్రమంలో ప్రజల భాష, వ్యవహారిక భాష ద్వారా ప్రజలు వారి భావాలను సులభంగా అర్థం చేసుకోగలరని చెప్పి వ్యవహారిక భాషా వాదాన్ని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి గిడుగు రామ్మూర్తి పంతులని, అందుకే వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు.  ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గుడిపాటి కోటయ్య ఒట్టే మాధవి తుమ్మలూరి శ్రీనివాస్ రెడ్డి రేణుక తదితరులు పాల్గొన్నారు

Previous post

ధ్యానం మనలో ప్రేమ, సహానుభూతి, సామరస్యాన్ని పెంపొందిస్తుంది: ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

Next post

సాగర్ ఎడమ కాలువ నుంచి 6,000 క్యూసెక్కుల నీటి విడుదల చెరువులు, కుంటలు నింపి తాగు, సాగునీటి అవసరాలు తీర్చడమే లక్ష్యం: ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి – BLR

You May Have Missed