మిర్యాలగూడ పట్టణ అభివృద్ధిపై మున్సిపల్ జనరల్ బాడీ సమావేశంలో విస్తృత చర్చ
ప్రజాలహరి మిర్యాలగూడ;మిర్యాలగూడ మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ ఛైర్మన్ సుధా బాలకృష్ణ , వైస్ చైర్మన్ గుడిపాటి శిరీష నవీన్ , మున్సిపల్ కమిషనర్ శ్రీజా రెడ్డి, ఆధ్వర్యంలో కౌన్సిలర్లతో నిర్వహించిన మున్సిపల్ జనరల్ బాడీ సమావేశంలో ముఖ్య అతిధిగా మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి – BLR పాల్గొన్నారు… ఈ సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలో చేపట్టాల్సిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై ఎమ్మెల్యే BLR కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు మరియు ప్రజాప్రతినిధులతో విస్తృతంగా చర్చించారు… పట్టణంలో మౌలిక వసతుల మెరుగుదల, పారిశుద్ధ్యం, తాగునీటి సౌకర్యాలు, రహదారులు, డ్రైనేజీ తదితర ప్రజా అవసరాలకు సంబంధించిన అంశాలపై ప్రత్యేకంగా చర్చించి, అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు… మిర్యాలగూడ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు మరియు సౌకర్యాలు కల్పించడమే ప్రధాన లక్ష్యమని వారు పేర్కొన్నారు…ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి పనులను చేపట్టి, వాటి అమలులో అధికారులు మరియు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు… పట్టణ అభివృద్ధికి సంబంధించిన ప్రతి అంశంపై ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటూ, మిర్యాలగూడను మరింత అభివృద్ధి చెందిన పట్టణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలిపారు.ఈ సమావేశంలో మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.



