భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మిర్యాలగూడ డివిజన్ ఆధ్వర్యంలో ఆర్డీవో గారికి మెమోరండం
భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మిర్యాలగూడ డివిజన్ ఆధ్వర్యంలో ఆర్డీవో గారికి మెమోరండం ఇవ్వనైనది
ప్రజాలహరి మిర్యాలగూడ; మిర్యాలగూడ డివిజన్ పరిధిలో రేషన్ డీలర్లు కొత్తగా పెళ్లయిన చనిపోయిన వ్యక్తుల ను నెల రోజు లు కాక ముందుకే వారి పేర్లను తొలగిస్తున్నట్టుగా కార్డు హోల్డర్ల కు చెబుతున్నారు. కానీ డీలర్లు ప్రభుత్వం దగ్గర నుండి వారి పేరు మీద రేషన్లు తీసుకొని డీలర్లు సొంతానికి ఉపయోగించుకుంటున్నారని వారు అన్నారు. ఒక్కొక్క డీలర్ దగ్గర అక్రమంగా 30 నుండి 50 పేర్లు వరకు వారి లిస్టులో ఉన్నాయని, కానీ సంవత్సరాల తరబడి వారి పేర్లను తొలగించకుండా రేషన్ బియ్యాన్ని స్వాహా చేస్తున్నారని, వారన్నారు. కానీ ఇట్టి విషయాన్ని ప్రభుత్వ అధికారులు కానీ ఎవరికి తెలియదని వారన్నారు. వీటన్నిటిని ప్రజాప్రతినిధిగా గ్రామ సర్పంచ్లను ప్రభుత్వ అధికారులుగా గ్రామ కార్యదర్శులను అంగన్వాడీ టీచర్లను ఆశా వర్కర్లను వీరితో పాటు మేధావి వర్గాన్ని వీరందరితో ప్రతి నెల రీసర్వ్ చేసి ఎంత రేషన్ వస్తుంది, ఎంత రేషన్ ప్రజలకు ఇస్తున్నారు, మిగిలింది ఎంత అనే విషయాలు ప్రభుత్వానికి లెక్క చెప్పవలసిన అవసరం వీరి మీద ఉంటుందని కానీ ప్రస్తుతం ఎవరు పట్టించుకోవడంలేదని వారు ఆరోపించిన ఇప్పుడు వచ్చే మూడు నెలల రేషన్ పేరు మీద ఉదాహరణకు ఒక్కొక్క డీలర్ దగ్గర ఐదు కింటాల్ నుండి పది కింటాల వరకు బియ్యం నిల్వలు ఉంటాయని సిపిఐ పార్టీ భావిస్తుందని సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు అన్నారు.డీలర్లు ఈ అక్రమ దందాలకు పాల్పడుతూ బియ్యం తీసుకునే కార్డు హోల్డర్ ఎవరైతే ఉన్నారో రేషన్ డీలర్ దగ్గరికి వినియోగదారులు పోతే వారిని ఒక బానిస లెక్క చూస్తున్నారు అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వీటన్నిటిని పునరాలోచన చేయాలని అదేవిధంగా మన రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు 60 సంవత్సరాలు దాటిన తర్వాత రిటైర్మెంట్ ఇస్తున్నారు కానీ 45 సంవత్సరాల నుండి డీలర్లకు రిటైర్మెంట్ లేకుండా వారు రేషన్ దందా నడిపిస్తున్నారని వారన్నారు. ప్రభుత్వం ఆలోచించాలి డిగ్రీలు పుచ్చుకున్న నిరుద్యోగులు చాలామంది యువతీ యువకులు ఉన్నారు. రేషన్ డీలర్లను చదువుకున్న యువతీ యువకులకు అప్పజెప్పాలని తమ ద్వారా ఈ విజ్ఞప్తి చేస్తున్నామని వారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ మిర్యాలగూడ మండల కార్యదర్శి అంజన్న, పెళ్లి రామలింగం, మండల సమితి సభ్యులు సాలె జగన్, గువ్వల మట్టయ్య, మహిళా సమైక్య నాయకురాలు దాసర్ల దుర్గమ్మ, ఎస్కే షమీం, పాల్గొన్నారు



