నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సింగ్ డాక్టర్ల రచ్చ.
ప్రజాలహరి మిర్యాలగూడ;రావే,పోవే,(బలిసి*ద) అంటూ మహిళ ఉద్యోగస్తులతో అన్ పార్లమెంటరీ భాష మాట్లాడుతూ మనో వేదనకు గురి చేస్తున్న డిప్యూటీ సూపర్డెంట్ పై నర్సింగ్ సిబ్బంది గళమెత్తారు! బేసిక్ సౌకర్యాలేవీ లేవు.. బాధ్యతలన్నీ నర్సులపైనేనా?తాగునీరు, వాష్రూమ్స్, డ్రెస్సింగ్ రూమ్స్, సెక్యూరిటీ, శానిటేషన్ సదుపాయాలపై నర్సింగ్ ఆఫీసర్ల ఆవేదన… ఈ నెలలో 14 మంది మహిళా నర్సింగ్ ఆఫీసర్లకు మెమోలు ఇవ్వడంపై తీవ్ర ఆగ్రహం… సెక్యూరిటీ, పారిశుద్ధ్య లోపాలకు కూడా నర్సులనే బాధ్యులను చేస్తున్నారని ఆరోపణ…డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నాగేశ్ తీరుపై నర్సింగ్ సిబ్బంది తీవ్ర ఆరోపణలు… అనుచిత వ్యాఖ్యలు, మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నారంటూ ఆవేదన… “నాలుగేళ్లుగా భరిస్తున్నాం.. ఇక భరించలేక బయటకు వచ్చాం”నర్సింగ్ సిబ్బంది ఆందోళనపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి.. ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి, వాస్తవాలు తేల్చాలని డిమాండ్.. జీజీహెచ్లో నర్సింగ్ సిబ్బంది సమస్యలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్న ఉద్యోగులు… ప్రైవేట్ హాస్పిటల్ లపై కొన్ని రోజులు దండయాత్ర చేసి అలసిపోయిన డీఎంహెచ్ఓ ప్రభుత్వ ఆసుపత్రి పై నజర్ వేయడం మరిచారా అంటూ ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు



