ప్రమాదకరంగా మారిన గుంతలమయమైన ప్రధాన రహదారి
ప్రమాదకరంగా మారిన గుంతలమయమైన ప్రధాన రహదారి
ప్రజాలహరి మిర్యాలగూడ;మిర్యాలగూడ పట్టణంలోని ఈదులగూడ చౌరస్తా వద్ద ప్రధాన రహదారి గుంతలమయంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారిపై ఏర్పడిన భారీ గుంతల్లో కొద్దిపాటి వర్షానికే నీరు నిలిచిపోవడంతో గుంతలు కనిపించకుండా పోతున్నాయి. దీంతో మలుపు వద్ద ప్రమాదాల ముప్పు మరింత పెరిగిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్గంలో నిత్యం అధిక సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుండటంతో రహదారి పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు గుంతలను తప్పించుకునే క్రమంలో ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ప్రధాన రహదారిపై ఉన్న గుంతలను శాశ్వతంగా పూడ్చడంతో పాటు, ప్రమాదకరమైన మలుపు వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి, అవసరమైన రహదారి భద్రతా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.



