నమ్మించి మోసం చేస్తున్న వారిపై ఉక్కు పాదం మోపాలి మరియు గంజాయి బ్యాచిలను నివారించాలి ;మిర్యాలగూడ బీజేపీ వన్ టౌన్ అధ్యక్షులు
ప్రజాలహరి మిర్యాలగూడ;భారతీయ జనతా పార్టీ మిర్యాలగూడ వన్ టౌన్ ఆధ్వర్యంలో మిర్యాలగూడ ఇన్చార్జి డిఎస్పి గౌరవనీయులు శ్రీ రవి గారికి బిజెపి వన్ టౌన్ మిర్యాలగూడ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బంటుగిరి కొంగరి వెంకటరమణ ల ఆధ్వర్యంలో అక్రమ వెల్నెస్ సెంటర్ లు ద్రావణం పేరిట లావుగా ఉన్న వారిని సన్నగా చేస్తామని అమాయక జనాన్ని నమ్మించి ప్రజల సొమ్ముతో ఆరోగ్యంతో చెలగాటమాడుతూ గొలుసు కట్టు వ్యాపారం యదేచ్చగా చేస్తూ పక్క రాష్ట్రం జిఎస్టి నెంబర్లు వాడుతూ గ్రామ గ్రామాన దళారీ వ్యవస్థను ఏర్పాటు చేస్తూ ఎలాంటి అనుమతులు లేకుండా యదేచ్చగా వ్యాపారం చేస్తున్న అక్రమ వెల్నెస్ సెంటర్ లపై చర్య తీసుకోవాలని,మరియు మిర్యాలగూడ పట్టణంలోని యువత ఎంజాయ్ పేరుతో గంజాయి గల్లీలను దాబాలను కిరాణా షాపులను టీ స్టాల్ ను నిర్మానుష్య ప్రాంతాలను అడ్డాలుగా చేసుకొని యువత గంజాయి సేవిస్తూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇట్టి గంజాయి సేవిస్తున్న వారిపై వారికి సరఫరా చేస్తున్న ముఠాలపై ప్రత్యేక నిఘా పెట్టి పట్టణంలో శాంతి భద్రత చర్యలను పటిష్టంగా అమలు చేసి పట్టణ ప్రజలకు ఉపశమనం కల్పించాలని కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో బిజెపి నల్గొండ జిల్లా కార్యదర్శి చిల్లం చర్ల అభి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వెలుగు ఇందిరా నాగరాజు, జిల్లా కార్యవర్గ సభ్యులు వెలుగు నాగరాజు, జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు బంటు యాదగిరి, వన్ టౌన్ ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, చిలుకూరి వెంకటేశ్వర్లు, మునగాల శివ, మండల సోములు, జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు బంటుగిరి, నాగరత్నం, మోషం వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.



