రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సహస్ర ఘటాభిషేకం
ప్రజాలహరి మిర్యాలగూడ;మిర్యాలగూడ పట్టణంలో వర్షాలు బాగా కురిసి పంటలు సమృద్ధిగా పండాలని మరియు ప్రజలు క్షేమంగా ఉండాలని కోరుకుంటూ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సహస్ర ఘటాభిషేకం మరియు వరుణ యాగం నిర్వహించడం శుభపరిణామం. స్థానిక శివాలయంలో కలశాలతో (సహస్ర ఘటాలు) స్వామివారికి విశేష అభిషేకం నిర్వహిస్తూ, వర్షాప్రాప్తి కోసం వరుణ యాగాన్ని శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి BLR తనయుడు ప్రసన్న కుమార్, DCC ప్రధాన కార్యదర్శి చిలుకూరి బాలకృష్ణ ,మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ గుడిపాటి శిరీష – నవీన్ కుమార్ దంపతులు, తెలంగాణ రాష్ట్ర రైస్ మిల్లర్స్ ఉపాధ్యక్షులు కర్నాటి రమేష్ , బండారు కుశలయ్య గారు, పట్టణ రైస్ మిల్లర్స్ అధ్యక్షులు గౌరు శ్రీనివాస్, కార్యదర్శి భోగవెల్లి వెంకట రమణ చౌదరి, కోశాధికారి గందె రాము, పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రైస్ మిల్లర్లు, స్థానిక నాయకులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై యజ్ఞక్రతువులో పాల్గొని పట్టణ రైతాంగం సంతోషంగా ఉండాలని ప్రార్థించారు.



