ప్రభుత్వ బడులను గాలికి వదిలేసిన సర్కార్ సమస్యల వలయంలో పేద విద్యార్థుల విద్యాభ్యాసం  పట్టి పట్టనట్టు వ్యవహరిస్తున్న విద్యాశాఖ అధికారుల తీరు SFI రాష్ట్ర కమిటీ సభ్యుడు కుర్ర సైదా నాయక్ 

ప్రజాలహరి మిర్యాలగూడ;భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ దామరచర్ల మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక మండల కేంద్రంలో ఉన్న MRO కార్యాలయం ముందు ధర్నా అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి SFI రాష్ట్ర కమిటీ సభ్యుడు కుర్ర సైదా నాయక్, వీరన్న మాట్లాడుతూ దామరచర్ల మండల కేంద్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాలు లేక అనేక సమస్యలతో విద్యా సంవత్సరం ప్రారంభం అయింది. విద్యాసంస్థలు ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవడానికి గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తున్న విద్యార్థులు పేద సామాజిక వర్గానికి చెందిన ఎస్సీ, ఎస్టీ,బీసీ మైనార్టీ పేద మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చే విద్యార్థులకు విద్యను దూరం చేసే విధంగా విద్యాధికారులు ప్రభుత్వం విద్యార్థులపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని స్పష్టంగా తెలుస్తుంది. ముఖ్యంగా ఏ ఒక్క ప్రభుత్వ పాఠశాలలో కూడా విద్యార్థినిలకు టాయిలెట్స్ రూమ్స్ లేక అందునా వాటర్ సదుపాయం లేక మండల కేంద్రంలో ఉన్న పాఠశాలలు గాని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పాఠశాలలో గాని విద్యార్థినిలు టాయిలెట్స్ వాష్రూమ్స్ వెళ్లాలి అంటే లోకల్ లో ఉన్న వారి ఇండ్లకు స్నేహితుల ఇండ్లకు వెళ్తున్నారు. గతంలో అనేక అధికారులకు అనేకసార్లు వినతి పత్రాలు ఇచ్చిన అధికారులు ఈ ప్రభుత్వాలు పట్టినట్టుగా వివరిస్తున్నారు. కావున ఈ సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే రిలే నిరాహార దీక్షలు, రాస్తారోకోలు అవసరమైతే మండల వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలన్నిటికి బందుకు కూడా పిలుపునిస్తామని హెచ్చరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మిర్యాలగూడ డివిజన్ అధ్యక్షులు జగన్ ,దామరచర్ల మండల కార్యదర్శి వీరన్న నాయక్ ,గర్ల్స్ కన్వీనర్ ఝాన్సీ,చంటి,వంశీ,తరుణ్,పవన్,దత్తు,అభి తదితరులు పాల్గొన్నారు.

You May Have Missed