విశ్వ మానవ సౌభ్రాతృత్వం కోసం రక్తదానం చేయాలి… రాజయోగిని శకుంతల..
ప్రజాలహరి మిర్యాలగూడ;మానవాళి విశ్వ మానవ సౌభ్రాతృత్వం కోసం అందరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని బ్రహ్మకుమారి సంస్థ రాజయోగిని శకుంతల పిలుపునిచ్చారు. రాజయోగిని ప్రకాశమని పుణ్యతిధి సందర్భంగా ఈదులగూడెం బ్రహ్మకుమారి సంస్థ ఆవరణలో ఆదివారం రక్తదాన శిబిరం ను ఆమె ప్రారంభించి మాట్లాడారు.
రక్తదానంతో అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి ప్రాణదానం చేయవచ్చని అన్నారు. ఈరోజు జరిగిన కార్యక్రమంలో 80 మంది రక్తదానంచేశారనితెలియజేశారు.కార్యక్రమంలో రామ్మోహన్, ప్రకాష్, శింగిరికొండ ప్రసాదరావు, మదన్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు



