యాదగిరిపల్లి గ్రామంలో ఘనంగా బోనాల మహోత్సవం. MLA -BLR
యాదగిరిపల్లి గ్రామంలో ఘనంగా బోనాల మహోత్సవం. MLA -BLR
ప్రజాలహరి మిర్యాలగూడ;మిర్యాలగూడ మండలం యాదగిరిపల్లి గ్రామంలో నిర్వహించిన బోనాల మహోత్సవంలో మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి – BLR పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని, ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, పాడిపంటలు సమృద్ధిగా కలగాలని ఆకాంక్షించారు. గ్రామ ప్రజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించిన బోనాల మహోత్సవంలో పాల్గొనడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పేర్కొన్నారు…తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతీకగా నిలుస్తుందని, మన ఆచార వ్యవహారాలను భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.



