మిర్యాలగూడలో బీఆర్టీయూ రైస్ మిల్ ఆపరేటర్స్ యూనియన్ మహాసభ
ప్రజాలహరి మిర్యాలగూడ, ఆగస్టు 23:మిర్యాలగూడ పట్టణంలోని స్థానిక బీఆర్ యాస్ కార్యాలయంలో బీఆర్టీయూ రైస్ మిల్ ఆపరేటర్స్ యూనియన్ మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మహాసభలో బీఆర్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు దుండిగల్ అంజయ్య మాట్లాడుతూ రైస్ మిల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం బీఆర్టీయూ నిరంతరం పనిచేస్తోందన్నారు. కార్మికులకు జీతాలు, బోనస్లు పెంచడంతో పాటు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించడంలో బీఆర్టీయూ ముందుండి పోరాడుతోందని తెలిపారు. బీఆర్టీయూ పట్టణ అధ్యక్షులు ఐల వెంకన్న గౌడ్ మాట్లాడుతూ కార్మికులందరూ ఐక్యంగా పనిచేసి తమ సమస్యల పరిష్కారం కోసం కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. కార్మికుల డిమాండ్ల సాధన కోసం ఐక్య కార్యాచరణ కమిటీ ఏర్పాటు చేసుకొని ముందుకు సాగాలని సూచించారు. పట్టణంలోని రైస్ మిల్ డ్రైవర్లకు ఎలాంటి సమస్య వచ్చినా బీఆర్టీయూ కార్మిక సంఘం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బీఆర్టీయూ రైస్ మిల్ ఆపరేటర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులుగా నల్లమోతు సిద్ధార్థ, అధ్యక్షులుగా పట్టం శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శిగా మహమ్మద్ పాషా,కోశాధికారిగా వెలగపూడి వెంకటరావు, ఎన్నికయ్యారు.ఉపాధ్యక్షులుగా: కులుకుల దశరథ, జమ్మి గుంపుల సుధాకర్, భీమిరెడ్డి వెంకటరెడ్డి. సహాయ కార్యదర్శులుగా: ఎస్కే గౌస్, ఎం. భూపతిరావు, జి. ఈశ్వరరావు. ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా: కులుకుల సైదులు, భారీ అశోక్, ఎం. నాగరాజు, పులి కరుణాకర్, కంపసాటి నాగరాజు ఎన్నికయ్యారు.మొత్తం 31 మంది సభ్యులతో నూతన కమిటీని ఏర్పాటు చేశారు. నూతన కమిటీ కార్మికుల హక్కుల పరిరక్షణతో పాటు వారి సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పనిచేస్తుందని నాయకులు తెలిపారు.



