రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ
ప్రజాలహరి మిర్యాలగూడ; SIR కార్యక్రమం విజయవంతానికి కృషి చేసిన BLAలకు కృతజ్ఞత సభ భారత రత్న, స్వర్గీయ మాజీ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ 82వ జయంతి సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు… మొదట పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం (రాజీవ్ భవన్) నందు రాజీవ్ గాంధీ చిత్రపటానికి మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి – BLR , కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు… అనంతరం పట్టణంలోని హౌసింగ్ బోర్డు SP కన్వెన్షన్ నందు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి – BLR ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు… ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ, SIR కార్యక్రమం నల్గొండ పార్లమెంట్ ఇంచార్జ్ బల్మూర్ వెంకట్ , పార్లమెంట్ కోఆర్డినేటర్ కస్బ శ్రీనివాస్ రావు గారు, డీసీసీ అధ్యక్షులు పున్నా కైలాష్ నేత హాజరయ్యారు… రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయం: ఎమ్మెల్యే BLR ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి – BLR మాట్లాడుతూ…భారతదేశాన్ని ఆధునిక, సాంకేతికతతో కూడిన దేశంగా తీర్చిదిద్దడంలో రాజీవ్ గాంధీ కీలకమైన పాత్ర పోషించారన్నారు.. యువతకు ప్రాధాన్యత, విద్య, సాంకేతిక రంగాల అభివృద్ధి, కంప్యూటర్ మరియు టెలికమ్యూనికేషన్ రంగాల్లో ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు నేటి ఆధునిక భారతదేశానికి బలమైన పునాదులు వేశాయి అన్నారు.. దేశ భవిష్యత్తు యువత చేతుల్లో ఉందని నమ్మిన రాజీవ్ గాంధీ ఆలోచనలు నేటి తరానికి కూడా ఎంతో స్ఫూర్తిదాయకం…గ్రామీణ స్థాయి నుంచి దేశ అభివృద్ధి వరకు ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలనే ఆయన ఆలోచనలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తపై ఉంది అని తెలిపారు.. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆయన దేశానికి అందించిన సేవలను స్మరించుకోవడంతో పాటు, సమాజంలోని ప్రతి వర్గానికి సమాన అవకాశాలు, యువతకు మెరుగైన భవిష్యత్తు, సాంకేతిక అభివృద్ధి, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం కృషి చేయాలని ఎమ్మెల్యే BLR పిలుపునిచ్చారు… అనంతరం SIR కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సందర్భంగా మిర్యాలగూడ నియోజకవర్గం BLAలతో కృతజ్ఞత సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే BLR మాట్లాడుతూ… SIR కార్యక్రమం విజయవంతం కావడంలో నియోజకవర్గంలోని BLAలు క్షేత్రస్థాయిలో చేసిన కృషి, సమన్వయం, అంకితభావం అభినందనీయం అని పేర్కొన్నారు… పార్టీ సంస్థాగత బలోపేతానికి ప్రతి కార్యకర్త, ప్రతి BLA కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది… ప్రజలకు, పార్టీకి మధ్య వారధిగా పనిచేస్తున్న BLAల సేవలను గుర్తించి, వారికి తగిన ప్రోత్సాహం అందిస్తాం… రాబోయే రోజుల్లో కూడా ఇదే ఐక్యత, సమన్వయంతో పార్టీని మరింత బలోపేతం చేద్దాం అని ఎమ్మెల్యే BLR అన్నారు… కార్యక్రమానికి హాజరైన నాయకులు, ప్రజాప్రతినిధులు, BLAలు, పార్టీ కార్యకర్తలు మరియు ఇతరులకు భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేశారు…ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చిలుకూరి సుధా బాలకృష్ణ , వైస్ చైర్మన్ గుడిపాటి శిరీష నవీన్ గారు, మండల అధ్యక్షులు, టౌన్ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, కౌన్సిలర్లు, ఇంచార్జులు, BLAలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…



