యాదగిరిపల్లి ZPHS పాఠశాలలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన త్రాగునీటి శుద్ధి ప్లాంట్ ప్రారంభం

ప్రజాలహరి మిర్యాలగూడ:మిర్యాలగూడ మండలం యాదగిరిపల్లి గ్రామంలోని ZPHS ఉన్నత పాఠశాలలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన శుద్ధి చేసిన త్రాగునీటి (Drinking Water Purified) ప్లాంట్‌ను మిర్యాలగూడ శాసనసభ్యులు. బత్తుల లక్ష్మారెడ్డి – BLR ప్రారంభించారు… ప్లాంట్‌ను ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి విద్యార్థులతో కలిసి శుద్ధి చేసిన త్రాగునీటిని తాగి, విద్యార్థులకు వాటర్ బాటిళ్లను పంపిణీ చేశారు… అనంతరం పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి, భోజనం నాణ్యత, పరిశుభ్రత, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు… ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గారు మాట్లాడుతూ…. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు స్వచ్ఛమైన త్రాగునీరు, పోషకాహారం, ఆరోగ్యకరమైన వాతావరణం అందించడం ఎంతో ముఖ్యమని అన్నారు. విద్యార్థుల ఆరోగ్యం, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని దాతల సహకారంతో పాఠశాలలో శుద్ధి చేసిన త్రాగునీటి ప్లాంట్ ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని, అదే సమయంలో దాతలు, ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి విద్యార్థులకు అవసరమైన సౌకర్యాల కల్పనలో భాగస్వాములు కావాలని కోరారు… ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జొన్నలగడ్డ శ్రీనివాస్ రెడ్డి , కాంగ్రెస్ నాయకులు గాయం ఉపేందర్ రెడ్డి , రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గౌరు శ్రీనివాస్ , పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, దాతలు, ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు…

You May Have Missed