ఇండియన్ అథ్లెటిక్స్ కు టెక్నికల్ అఫీషియల్ గా రమేష్ ఎన్నిక
*ఇండియన్ అథ్లెటిక్స్ కు టెక్నికల్ అఫీషియల్ గా రమేష్*
మిర్యాలగూడ ప్రజాలహరి
ఈనెల 18న హనుమకొండలో నిర్వహించనున్న ఇండియన్ అథ్లెటిక్స్ సిరీస్ 13 జాతీయస్థాయి పోటీలకు మిర్యాలగూడకు చెందిన బొడ్డుపల్లి రమేష్ టెక్నికల్ అధికారిగా ఎంపికయ్యారు. జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు సాంకేతిక అధికారిగా అవకాశం లభించడం పట్ల రమేష్ సంతోషం వ్యక్తం చేశారు.అథ్లెటిక్స్ నిబంధనలకు అనుగుణంగా పోటీలను సమర్ధవంతంగా నిర్వహించేందుకు తన వంతు కృషి చేస్తానని రమేష్ తెలిపారు. తాను ప్రస్తుతం మిర్యాలగూడలోని మున్సిపల్ కార్యాలయంలో వార్డ్ ఆఫీసర్ గా ఉద్యోగం చేస్తున్నానని క్రీడల పట్ల ఉన్న మక్కువతో జాతీయ స్థాయి పోటీల్లో టెక్నికల్ అధికారిగా బాధ్యత నిర్వహించే అవకాశం తాను క్రీడా రంగంలో సాధించిన పథకాలే కారణమన్నారు.



