సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ జయంతి సందర్భంగా ఘన నివాళులు

ప్రజాలహరి మిర్యాలగూడ; సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ గారి 376వ జయంతి సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలోని గౌడ సంఘం భవనంలో గౌడ సంఘం సభ్యులతో కలిసి వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి – BLR .ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ….సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన గొప్ప వీరుడు అని కొనియాడారు… సమాజంలో అణగారిన వర్గాలకు ఆత్మగౌరవం, సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయమని పేర్కొన్నారు… పాపన్న గౌడ్ మహారాజ్ గారి ఆశయాలు, స్ఫూర్తిని నేటి యువత ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు… ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు, సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…

You May Have Missed