ఎల్నినో ప్రభావంతో వర్షాధార పంటలపై రైతులకు అవగాహన కార్యక్రమం
ప్రజాలహరి మిర్యాలగూడ: మిర్యాలగూడ రైతువేదికలో ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో, రైతులకు ప్రత్యామ్నాయ పంటలు మరియు వర్షాధార పంటల సాగుపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా PCC డిలీగెట్ మెంబర్ చిరుమర్రి కృష్ణయ్య, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి నర్సిరెడ్డి,పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి మండల వ్యవసాయ అధికారి మేకల ఋషేంద్రమని గారు, AEO మాలవత్ రమేష్ గారు రైతులకు పలు సూచనలు చేశారు. తక్కువ నీటి లభ్యత ఉన్న పరిస్థితుల్లో వరి పంటకు ప్రత్యామ్నాయంగా తక్కువ నీటితో సాగు చేయగల వర్షాధార పంటలను ప్రోత్సహించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తలకొప్పుల సైదులు , కేతావత్ జవహర్,ప్రవీణ్,రైతులు మోహన్ రెడ్డి , రాఘవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వర్షాధార పరిస్థితులకు అనుగుణంగా కంది, పెసర, మినుము, జొన్న, సజ్జ, రాగి, నువ్వులు, ఆముదం వంటి తక్కువ నీటి అవసరం ఉన్న పంటలను సాగు చేసుకోవాలని రైతులకు సూచించారు. వర్షాధార పంటలు – తక్కువ నీటి అవసరం – స్థిరమైన సాగు రైతు సంక్షేమమే వ్యవసాయ శాఖ లక్ష్యం అని అన్నారు.



