ఒంటరి మహిళా పెన్షన్ దరఖాస్తుదారులకు తహశీల్దార్ ధృవీకరణ పత్రాలు వెంటనే ఇవ్వాలి. అర్హులైన మహిళలను పెన్షన్‌కు దూరం చేయొద్దు – BRS పట్టణ కమి
ప్రజాలహరి మిర్యాలగూడ: మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలో ఒంటరి మహిళా పెన్షన్‌కు అర్హులైన దరఖాస్తుదారులకు తహశీల్దార్ ధృవీకరణ పత్రాలు జారీ చేయకపోవడం వల్ల వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని BRS పట్టణ కమిటీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై ఈ రోజు మిర్యాలగూడ పట్టణంలోని BRS పార్టీ కార్యాలయంలో పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడుతూ, ఒంటరి మహిళా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న అనేక మంది మహిళలకు అవసరమైన తహశీల్దార్ ధృవీకరణ పత్రాలు అందకపోవడంతో తమ దరఖాస్తుల పరిస్థితి ఏమిటో తెలియక అయోమయానికి గురవుతున్నారని తెలిపారు. భర్తను కోల్పోయిన లేదా కుటుంబానికి దూరంగా ఒంటరిగా జీవిస్తున్న మహిళలకు ప్రభుత్వ పెన్షన్ ఎంతో కీలకమైన ఆర్థిక సహాయమని, అధికారుల నిర్లక్ష్యం లేదా ధృవీకరణ ప్రక్రియలో జాప్యం కారణంగా అర్హులైన మహిళలు సంక్షేమ పథకానికి దూరం కాకూడదని అన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలోని సంబంధిత తహశీల్దార్లకు నల్లగొండ జిల్లా కలెక్టర్ గారు వెంటనే ఆదేశాలు జారీ చేసి, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి అర్హులైన ఒంటరి మహిళలకు ధృవీకరణ పత్రాలను తక్షణమే జారీ చేయించాలని BRS పట్టణ కమిటీ డిమాండ్ చేసింది. అలాగే అర్హత కలిగిన ప్రతి ఒంటరి మహిళకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పెన్షన్ అందేలా జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. సమస్య పరిష్కారం కాకపోతే బాధిత మహిళల తరఫున BRS పార్టీ ఆధ్వర్యంలో మరింత పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని నాయకులు హెచ్చరించారు. కార్యక్రమములో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఎండి.ఇలియాస్ ఖాన్,పెద్ది శ్రీనివాస్ గౌడ్, పద్మశెట్టి లక్ష్మి కోటేశ్వర రావు, తీరంశెట్టి సీతా కోటేశ్వర రావు,పునాతి లక్ష్మీనారాయణ, దీపిక విజయ్, జానకమ్మ దుర్గాప్రసాద్,లావుడి అరుణ సుధాకర్, సందేషి రజిని అంజన్ రాజు,మర్రి అంజిబాబు,తిరుమలగిరి వజ్రం,వడ్డేపల్లి శ్రీనివాస్,జన్నపాల సునీత కిరణ్, యర్రమల్ల దినేష్,గంగుల బిక్షం యాదవ్, భూక్య రాంబాబు,ఆయిల వెంకన్న,ఎనుగంటి తిరుపతయ్య నాయుడు,వల్లపట్ల వినోద్,కందగట్ల అశోక్,పందిరి వేణు,నునే రవి కుమార్,కంచర్కుంట్ల దయాకర్ రెడ్డి,నేరెళ్ళ శివ, తదితరులు ఉన్నారు..



