మిర్యాలగూడ ఎల్ఐసి ఆఫీసు వద్ద యూటర్న్ ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చిన ఎమ్మెల్యే బిఎల్ఆర్
ప్రజాలహరి మిర్యాలగూడ క్రైమ్
మిర్యాలగూడ ప్రధాన వ్యాపార కేంద్రమైన సాగర్ రోడ్డులో రాజీవ్ గాంధీ విగ్రహం మొదలుకొని ఫ్లై ఓవర్ వరకు గల డివైడర్లను పునర్నిర్మాణంలో భాగంగా భారీగా నిర్మిస్తున్న డివైడర్లను మరియు ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్నటువంటి మోర్ సూపర్ మార్కెట్ నుండి ఫ్లైఓవర్ వరకు కలిగిన డివైడర్లు మధ్యలో ఎటువంటి యూటర్న్ లేకపోవడంతో ఈ రోజున మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (BLR)గారు చొరవ తీసుకొని ప్రజా సౌకర్యార్థం ఈరోజు ఫ్లైఓవర్ దగ్గర సులబ్ కాంప్లెక్స్ కాంప్లెక్స్ శంకుస్థాపనకు విచ్చేసి న సందర్భంగా రవాణా పరంగా ప్రజలకు ఉన్న సౌకర్యాన్ని గుర్తించి స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేయగా తక్షణమే స్పందించిన మునిసిపల్ అధికారులు ఎల్ఐసి ఆఫీసు ముందు యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించి ఈరోజు సాయంత్రం 6:15 నిమిషాలకు డివైడర్ను కట్ చేశారు మరియు గతంలో మాదిరిగా యూటర్న్ పునరుద్ధరించి ప్రజల కు సౌకర్యవంతంగా ఉండే విధంగా ఏర్పాట్లు చేయించారు ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు కోటేశ్వరరావు ఇందిరా నాగరాజు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు



