అమావాస్య సందర్భంగా వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత అల్పాహారం, త్రాగునీటి పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి – BLR

 


అమావాస్య సందర్భంగా వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత అల్పాహారం, త్రాగునీటి పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి – BLR

ప్రజాలహరి మిర్యాలగూడ;          ఈరోజు మిర్యాలగూడ బస్టాండ్‌లో వాసవి క్లబ్ మిర్యాలగూడ వారి ఆధ్వర్యంలో అమావాస్య సందర్భంగా నిర్వహించిన ఉచిత అల్పాహారం, త్రాగునీటి పంపిణీ కార్యక్రమంలో             శాసనసభ్యులు  బత్తుల లక్ష్మారెడ్డి – BLR  ముఖ్య అతిథిగా పాల్గొన్నారు…             ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గారు ప్రయాణికులకు స్వయంగా అల్పాహారం పంపిణీ చేసి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు…      మండుటెండలు, ప్రయాణాల మధ్య ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని, సమాజంలో సేవా భావాన్ని పెంపొందించే ఇటువంటి కార్యక్రమాలు మరింత మందికి ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు…     వాసవి క్లబ్ సభ్యులు నిరంతరం సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు అండగా నిలవడం సంతోషకరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు…    సమాజంలోని ప్రతి ఒక్కరూ తమకు సాధ్యమైన మేరకు సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు…     ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, సామాజిక సేవకులు, క్లబ్ సభ్యులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు…

You May Have Missed