రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చిలుముల అంజయ్యకు మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు నివాళులు

 

ప్రజాలహరి మిర్యాలగూడ క్రైమ్;

  •      రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చిలుముల అంజయ్యకు మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు నివాళులు

వేములపల్లి మండలం రావులపెంట గ్రామానికి చెందిన చిలుముల అంజయ్య మేడారం సమ్మక్క-సారలమ్మ దేవతల దర్శనానికి వెళ్తుండగా జరిగిన విషాదకర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసి, మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు గారు వారి నివాసానికి చేరుకుని అంజయ్య పార్ధివదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.     ఈ సందర్భంగా గాయాలపాలైన అంజయ్య కుటుంబ సభ్యులను పరామర్శించిన భాస్కర్ రావు గారు, అంజయ్య మృతి పట్ల వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని ఆకాంక్షించారు. అంజయ్య అకాల మరణం అత్యంత బాధాకరమని పేర్కొంటూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.      ఈ కార్యక్రమంలో  నామిరెడ్డి కరుణాకర్ రెడ్డి, నంద్యాల శ్రీరాం రెడ్డి, సందరబోయిన చంద్రయ్య, తరికోప్పుల వెంకటేశ్వర్లు,జిన్నా శేఖర్ రెడ్డి,సైదులు,కత్తుల సైదులు, తరి సైదులు, చిలుముల సైదులు,పల్లా గోవర్ధన్, పసుల రమేష్, అంజయ్య, స్థానిక BRS పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, కార్యకర్తలు మరియు అంజయ్య కుటుంబ సభ్యులు  పాల్గొని నివాళులర్పించారు.

Previous post

 S.I.R. కార్యక్రమం విజయవంతానికి సమన్వయంతో పనిచేయాలి – మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు

Next post

మిర్యాలగూడ మండల వ్యవసాయ అధికారి (MAO) రుషేంద్రమని ఆధ్వర్యంలో రైతు వేదిక గురించి ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్

You May Have Missed