S.I.R. కార్యక్రమం విజయవంతానికి సమన్వయంతో పనిచేయాలి – మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు

S.I.R. కార్యక్రమం విజయవంతానికి సమన్వయంతో పనిచేయాలి – మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు.       ప్రజాలహరి మిర్యాలగూడ;  S.I.R. కార్యక్రమంలో భాగంగా మిర్యాలగూడ పట్టణంలోని 48 వార్డులకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు, వార్డు ఇంచార్జ్ లు, BRS పార్టీ తరఫున పనిచేస్తున్న BLAలతో మిర్యాలగూడ పట్టణం రెడ్డి కాలనీలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే, మిర్యాలగూడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ శ్రీ నల్లమోతు భాస్కర్ రావు గారు ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు.    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, S.I.R. ప్రక్రియలో పార్టీ నాయకులు, BLAలు పూర్తి అప్రమత్తంగా ఉండి ప్రతి ఓటరుకు న్యాయం జరిగేలా పనిచేయాలని సూచించారు. ప్రతి వార్డులో ఓటరు జాబితాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ, అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైన అభ్యంతరాలు, దరఖాస్తులను ఎన్నికల సంఘం నిబంధనల మేరకు సకాలంలో సమర్పించాలని తెలిపారు.  అలాగే పార్టీ నాయకులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ప్రతి వార్డులో పార్టీ శ్రేణులను చైతన్యపరిచి, S.I.R. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వారికి అవసరమైన సహాయం అందించాలని సూచించారు.   ఈ సమావేశంలో  ఎండి.ఇలియాస్ ఖాన్, ఎండి.మగ్దుం పాషా, ఎండి.మాజీద్, గుడిసె దుర్గా ప్రసాద్, దైద సత్యం, కోల రామస్వామి,చిట్టుపోలు వెంకటేశ్వర్లు, గంగుల బిక్షం యాదవ్, సందేషి అంజన్ రాజు,తిరంశెట్టి కోటేశ్వర రావు, మర్రి అంజిబాబు, వడ్డేపల్లి శ్రీనివాస్, పెండ్యాల పద్మ, షహనాజ్ బేగం,పిన్నబోయిన శ్రీనివాస్ యాదవ్, గణేష్, ఎండి.షోయబ్, కోదాటి రమా, పెరుమాళ్ళ ధనమ్మ, నక్క సంధ్య, ధూళిపాల కళావతి,ఆయిల వెంకన్న, ఎస్.శ్రీనివాస్, రామవాత్ చంటి,భూక్య రాంబాబు, వెంకట రాములు,నునే రవి కుమార్, శ్రావణ్ రెడ్డి,అశోక్, అయోధ్య,ఈశ్వర్ చారి,ఎక్క మనిదీప్, వల్లపట్ల వినోద్,కిరణ్,నేరెళ్ళ రవి,నేరెళ్ళ శివ, కూరపాటి సాంబశివ రావు, పందిరి వేణు,కనకయ్య,దైద వెంకటేష్, శ్రినాద్,రుక్షాన, దోనేటి సైదులు,డశ్రు నాయక్,అరుణ్ కుమార్, అసిం,ముకేష్ చౌదరి,సిరాజ్, మిర్యాలగూడ పట్టణానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు, వార్డు ఇంచార్జ్‌లు, BLAలు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు* పాల్గొన్నారు.

You May Have Missed