SIR కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి ఎమ్మెల్యే బిఎల్ఆర్

ప్రజాలహరి మిర్యాలగూడ *SIR కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించి ప్రతి అర్హ ఓటరుకు న్యాయం చేయాలి – ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి -BLR**

ఈరోజు దామరచర్ల మండల కేంద్రంలో నిర్వహించిన **SIR (Special Intensive Revision)** కార్యక్రమంపై అవగాహన సమావేశంలో

మిర్యాలగూడ శాసనసభ్యులు **బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు ** పాల్గొన్నారు.

ఈ సమావేశంలో మండలానికి చెందిన సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, BLAలు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు…

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఎన్నికల సంఘం చేపట్టిన **SIR కార్యక్రమాన్ని బాధ్యతాయుతంగా నిర్వహించి ప్రతి అర్హ ఓటరు పేరు ఓటరు జాబితాలో ఉండేలా కృషి చేయాలని** సూచించారు…

అర్హులైన ఓటర్ల నమోదు, వివరాల సవరణ, చిరునామా మార్పులు, తొలగింపులు వంటి అంశాల్లో ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని BLAలకు దిశానిర్దేశం చేశారు…

ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, సర్పంచులు, BLAలు సమన్వయంతో పనిచేసి ఒక్క అర్హ ఓటరు కూడా జాబితా నుంచి మినహాయింపుకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు…

ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటరు జాబితా ఎంతో కీలకమని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పనిచేయాలని పిలుపునిచ్చారు…

ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, BLAలు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…

You May Have Missed