చెడు వ్యసనాలకు బానిసై చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న వ్యక్తులు అరెస్టు
ప్రజాలహరి మిర్యాలగూడ క్రైమ్
చెడు వ్యసనాలకు అలవాటై చైన్ స్నాచింగ్ కు పాల్పడిన దుండగుల కేసును ఛేదించిన పోలీసులు
మిర్యాలగూడ స్థానిక వాసవి నగర్ లో జరిగిన చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు ఛేదించారు
హైదరాబాదులో రాపిడో డ్రైవర్లుగా పనిచేస్తున్న అజ్మీర శశిధర్ నాయక్ 24
ధనోత్ కార్తీక్ 25 చెడు వ్యసనాలకు బానిసై సులభంగా డబ్బు సంపాదన అనే దురుద్దేశంతో నేరాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెళ్లడైంది
అదేవిధంగా హైదరాబాదులో పార్కు చేసి ఉన్న హోండా యాక్టివా స్కూటీ దొంగిలించి దానిని దొంగతనాలకు ఉపయోగిస్తున్నట్లు ఇందులో భాగంగా 17వ తేదీ మిర్యాలగూడలో సంతోష్ నగర్ ప్రాంతంలో ఇంటిముందు పనిచేస్తున్న ఒక మహిళ మెడలో ఉన్న బంగారం చైనును లాక్కొని పరారయ్యారు తదుపరి దుంగిలించిన బంగారంను స్థానిక మనపురం ఫైనాన్స్లో తాకట్టుపెట్టి ఒక లక్ష ఇరవై రెండు వేలు అప్పుగా తీసుకున్నట్లు తీసుకున్న ధనాన్ని ఇరువురు సరి సమానంగా పంచుకొని ఖర్చు చేసినట్లు నిందితులు పోలీసుల విచారణలో ఒప్పుకున్నారు ఈరోజు ఫ్లైఓవర్ సమీపంలో జరిగిన తనిఖీల్లో భాగంగా నిందితులు పారిపోతుండగా అనుమానం వచ్చిన ఎస్సై వారిని వెంబడించి పట్టుబడి చేసి రిమాండ్ కు తరలించాము అని మిర్యాలగూడ టూ టౌన్ ఎస్సై జే సోమ నరసయ్య ఒక ప్రకటనలో తెలిపారు వీరు నుండి రెండు సెల్ ఫోన్లు ఒక స్కూటీ వాహనం మరియు డిస్కవరీ వాహనం రెండు మొబైల్ ఫోన్లు మరియు మనపురం ఫైనాన్స్ కాగితాలు సాధనపరుచుకున్నట్లు తెలిపారు ఎస్పీ శరత్చంద్ర పవర్ ఐపీఎస్ నల్గొండ జిల్లా ఆధ్వర్యంలో టూ టౌన్ ఇన్స్పెక్టర్ జె సోమనర్సయ్య సబ్ ఇన్స్పెక్టర్ మరియు సిబ్బంది స్వర్ణ నాయక్ మణిదీప్ సమాధాన ప్రసాద్ అక్బర్ బాషా రామకృష్ణ రాజశేఖర్ మరియు ఇతర సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు



