వృద్ధ తల్లిదండ్రులకు కొడుకు వేధింపుల నుంచి విముక్తి.. వారి గృహాన్ని వారికి అందవేత

వృద్ధ తల్లిదండ్రులకు న్యాయం చేసిన జిల్లా కలెక్టర్

మిర్యాలగూడ ప్రజాలహరి

ఈరోజు మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలోని ఇంజం చంద్రకళ భర్త రమణారెడ్డి 70 సం.. వయోవృద్ధులు వీరికి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె వీరికి విద్యాభ్యాసం పెళ్లిళ్లు బాధ్యతలు అన్ని నిర్వర్తించడం జరిగింది వీరికి వ్యవసాయ భూమి ఇంజంవారిగూడెం,నేరేడుచర్ల మండలంలో సూర్యాపేట జిల్లా లో కలదు వీరికి ఒక నివాసము మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలోని కలదు ఇట్టి వీరి పేరు మీద ఉన్నటువంటి ఇంటిలో కుమారుడు గత ఐదేళ్లగా నివాసం ఉంటూ తల్లిదండ్రులను రానివ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తూ అనారోగ్య సమస్యలతో పక్షవాతం మోకాళ్ళ ఆపరేషన్ అనారోగ్య సమస్యలతో సతమతమవుతూ ఆర్డిఓ ట్రిబ్యునల్ మరియు అప్పిలేట్ ట్రిబ్యునల్ ని సీనియర్ సిటిజెన్స్ చట్టాన్ని ఆశ్రయించడంతో వయోవృద్ధుల చట్టం 2007 అనుసరించి జిల్లా కలెక్టర్ గారు గత నెల 15వ తేదీన వారికి స్వాధీనపరచాలని ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది . ఇట్టి ఉత్తర్వులను అమలుపరచవలసిందిగా స్థానిక ఆర్డిఓ ఎస్ రమణారెడ్డి గారు వివిధ డిపార్ట్మెంట్ల సమన్వయంతో జరపాలని 23వ తేదీ నాడు ఉత్తర్వులు ఇవ్వడంతో ఉత్తర్వుల అమలులో భాగంగా మున్సిపల్ కమిషనర్ నర్రా శ్రీజా రెడ్డి గారు స్థానిక సీఐ నాగభూషణం గారు మరియు తాసిల్దార్ సిబ్బంది రెవిన్యూ మరియు మహిళా శిశు వికలాంగుల వయోవృద్ధుల శాఖ అందరు కలిసి ఆ వయోవృద్ధులని వారి ఇంటిలో ఉంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది సైదులు అనిల్ కుమార్, గోపమ్మ, మున్సిపల్ సిబ్బంది సాజిద్ సాంబయ్య, రెవిన్యూ శాఖ నుండి సిబ్బంది, సిడిపిఓ కార్యాలయం నుండి రాములు , నాగిరెడ్డి ,నవీన్ సునీల్ తదితరులు పాల్గొన్నారు.

Previous post

మిర్యాలగూడలోవిద్యుత్ షార్ట్ సర్క్యూట్ అగ్ని ప్రమాదంలో ముగ్గురు మృతి

Next post

నల్గొండ జిల్లా వక్స్ బోర్డు ర్యాలయం పై మరియు వక్స్ బోర్డు ఇన్స్పెక్టర్ మహమ్మద్ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ పట్టుకున్న ఏసీబీ పోలీసులు

You May Have Missed