హాలియాలో నాగార్జునసాగర్ నియోజకవర్గ గ్రాడ్యుయేట్ ఎన్నికల సన్నాహక సమావేశం

ప్రజాలహరి హాలియా;హాలియాలో మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అధ్యక్షతన నాగార్జునసాగర్ నియోజకవర్గ గ్రాడ్యుయేట్ ఎన్నికల సన్నాహక సమావేశం. ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర ట్రైకార్ మాజీ చైర్మన్ ఇస్లావత్ రాంచందర్ నాయక్. గతంలో నియోజకవర్గంలో 12,000 మంది గ్రాడ్యుయేట్ ఓటర్స్ ఉన్నారు. ఈసారి నియోజకవర్గంలో గ్రాడ్యుయేట్ ఓటర్లుపెరిగే అవకాశం ఉంది. గ్రామాల వారిగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు గ్రామంలో ఉన్న గ్రాడ్యుయేషన్ గుర్తించి వారిచే ఓటు నమోదు చేయించాలి.తెలంగాణ వాదాన్ని గెలిపించాలని ఉద్దేశంతో రెండు పర్యాయాలు నల్లగొండ ఖమ్మం వరంగల్ పోటీ చేసిన దిలీప్ కుమార్ ను ఎమ్మెల్సీగా గెలిపించుకోవడం జరిగింది. మరల పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీగా గెలిపించుకోవడం జరిగింది.రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాలలో విఫలం చెందింది. గత శాసనసభ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ కూడా ఈ ప్రభుత్వం నెరవేర్చలేదు.జాబ్ క్యాలెండర్ విడుదల చేయకుండా విద్యార్థి యువతను నిరుద్యోగులను ఈ ప్రభుత్వం మోసం చేసింది.రాష్ట్ర ప్రభుత్వ తీరుపై పట్టబద్రులు ఆగ్రహం గా ఉన్నారు. గ్రామాల వారీగా ఉన్న టిఆర్ఎస్ పార్టీ నాయకులు పట్టభద్రులను కలిసి ఓటర్లుగా నమోదు చేయించాలి . ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవుళ్ళను విడదీసి మాట్లాడుతుండు. ప్రజల మధ్య విద్వేషాలు కలిగే విధంగా ముఖ్యమంత్రి మాట్లాడడం బాధాకరం. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు సమస్యల నుంచి ప్రజలను తప్పుదారి పట్టించేందుకే ముఖ్యమంత్రి డైవర్షన్ పాలిటిక్స్ పాల్పడుతున్నారు.స్థానికంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు సమన్వయంతో కలిసి పనిచేస్తే త్వరలో జరిగే నల్గొండ వరంగల్ ఖమ్మం నియోజకవర్గ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ గెలవడం తథ్యం. నల్లగొండ వరంగల్ ఖమ్మం గ్రాడ్యుయేట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులు వెనకాడుతున్నారు. అంటే ఇది ప్రభుత్వ వైఫల్యానికి బిఆర్ఎస్ పార్టీ విజయానికి నాంది.ఈ సమావేశంలో టిఆర్ఎస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు గ్రామ శాఖ బాధ్యులు అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

You May Have Missed