గ్రామ శాఖ ఏర్పాట్లకు కసరత్తు మండల పార్టీ అధ్యక్షులు
వేములపల్లి( ప్రజాలహరి) నల్గొండ జిల్లా వేములపల్లి మండలంలోని 12 గ్రామ పంచాయతీలకు నూతన గ్రామ శాఖ పార్టీ అధ్యక్షులు ఎన్నుకోవడానికి మండల పార్టీ అధ్యక్షులు రేగటి రవీందర్ రెడ్డి కసరత్తు ప్రారంభించారు. శుక్రవారం ఆయన మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ ప్రతి గ్రామ శాఖ అధ్యక్షులు పార్టీ ప్రతిష్ట కోసం పనిచేసేవారిని ఎన్నుకోవడం జరుగుతుంది అన్నారు. అంతేకాకుండా ముఖ్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తపై ఉందని అన్నారు. నూతన గ్రామ శాఖ అధ్యక్షులు ఆయా గ్రామాల్లో సమావేశం నిర్వహించి కార్యకర్తలు అందరి సమక్షంలో ఈనెల 10వ తారీఖు లోపు ఎన్నుకోవడం జరుగుతుందని ఆయన అన్నారు.



