గాంధీజీ ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం; సర్పంచ్ ఎలికట్టి

ప్రజాలహరి వేములపల్లి ; గాంధీజీ ఆశయాలు నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని లక్ష్మీదేవి కూడా సర్పంచ్ ఎలికట్టి భరత్ అన్నారు. శుక్రవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గం వేములపల్లి మండలంలో లక్ష్మీదేవి గూడెం గ్రామంలో జాతిపిత మహాత్మా గాంధీ 157 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీజీ, సత్యం, అహింస, శాంతి మార్గాలను ఎంచుకొని దేశానికి స్వతంత్రం సాధించేంత వరకు అల్పెరుగని పోరాటం చేసిన మహాయోధుడని ఆయన కొనియాడారు. అంతేకాకుండా ఆయన చూపించిన మార్గం నేడు ప్రపంచానికి ఎంతో స్ఫూర్తిదాయకమని ఆయన అన్నారు. ముఖ్యంగా గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరు ఆచరించి సమాజాభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని ఆయన సూచించారు. నేడు గ్రామాల్లో పరిశుభ్రత, ప్రజల ఐక్యత, సేవాభావము పెంపొందించడం కోసం గాంధీజీకి మనం ఇచ్చే నిజమైన నివాళి అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి కళ్యాణి, ఉపసర్పంచి గంట స్వాతి నరసయ్య, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.

You May Have Missed