జాతిపిత మహాత్మా గాంధీకి ఘన నివాళులు శంకర్ నాయక్ MLC

ప్రజాలహరి మిర్యాలగూడ;(హరిప్రసాద్ చీదళ్ళ);జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా స్థానిక శాసనసభ్యులు గౌరవ శ్రీ బత్తుల లక్ష్మా రెడ్డి మరియు గౌరవ ఎమ్మెల్సీ శ్రీ కేతావత్ శంకర్ నాయక్ మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మహాత్మా గాంధీని స్మరించుకుంటూ, దేశ స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన త్యాగాలు, అహింసా మార్గంలో సాగించిన పోరాటం, దేశానికి అందించిన సేవలను కొనియాడారు. అలాగే స్వాతంత్ర్య ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ పోషించిన కీలక పాత్రను గుర్తుచేశారు.ఈ కార్యక్రమంలో నల్లగొండ జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు ముదిరెడ్డి నర్సిరెడ్డి, కౌన్సిలర్లు, వివిధ విభాగాల ఇన్‌చార్జీలు, ఆర్టీసీ అధికారులు, సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్సీ అభిమానులు పాల్గొని మహాత్మా గాంధీకి ఘన నివాళులు అర్పించారు.“సత్యం, అహింస, శాంతి మార్గంలో గాంధీజీ చూపిన బాట మనందరికీ స్ఫూర్తిదాయకం.”

You May Have Missed