మిర్యాలగూడలో ఘనంగా జల్సా కార్యక్రమం ఆలిమ్ కోర్సు పూర్తి చేసిన విద్యార్థినులకు సర్టిఫికెట్ల పంపిణీ

ప్రజాలహరి మిర్యాలగూడ;(హరిప్రసాద్ చీదళ్ళ);మిర్యాలగూడ పట్టణంలోని మినీ రవీంద్ర భారతి నందు నిర్వహించిన జల్సా కార్యక్రమానికి మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి – BLR ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమెనా మదర్సాలో ఆలిమ్ కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థినులను అభినందించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి-BLR మాట్లాడుతూ.. ఆలిమ్ కోర్సును పూర్తి చేయడానికి సుమారు ఐదు సంవత్సరాల పాటు క్రమశిక్షణతో, అంకితభావంతో విద్యను అభ్యసించడం అభినందనీయమని అన్నారు. విద్యార్థినులు తమ విద్యను సమాజ అభివృద్ధికి ఉపయోగపడే విధంగా కొనసాగించాలని ఆకాంక్షించారు.విద్య అనేది కేవలం జ్ఞానాన్ని సంపాదించుకోవడమే కాకుండా, మంచి నడవడిక, క్రమశిక్షణ, సేవాభావం, మానవత్వం మరియు సమాజం పట్ల బాధ్యతను పెంపొందించుకోవడం కూడా అని పేర్కొన్నారు.ప్రతి ఒక్కరూ ప్రవక్త మహమ్మద్ చూపిన శాంతి, ప్రేమ, సోదరభావం, కరుణ మరియు మానవతా విలువల మార్గంలో నడవాలని ఎమ్మెల్యే కోరారు.యువత విద్యతో పాటు మంచి విలువలను అలవర్చుకుని సమాజానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు.ఆలిమ్ కోర్సును పూర్తి చేసిన విద్యార్థినులకు, వారికి విద్యాబోధన అందించిన ఉలమాలు, ఉపాధ్యాయులు, మదర్సా నిర్వాహకులు మరియు తల్లిదండ్రులకు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు..ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ డీసీసీ జనరల్ సెక్రెటరీ చిలుకూరి బాలకృష్ణ , మదర్సా నిర్వాహకులు, ఉలమాలు, ఉపాధ్యాయులు, విద్యార్థినులు, తల్లిదండ్రులు, ముస్లిం మత పెద్దలు మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు…

Previous post

మిర్యాలగూడ పట్టణంలో డంపింగ్ యార్డును సందర్శించిన శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి (BLR) మున్సిపల్ చైర్ పర్సన్ చిలుకూరి సుధ – బాలకృష్ణ, వైస్ చైర్‌ పర్సన్ గుడిపాటి శిరీష – నవీన్ కుమార్,మున్సిపల్ కమిషనర్ నర్రా శ్రీజ రెడ్డి,

Next post

కార్మిక–కర్షక పోరాటాల స్ఫూర్తితో రైతు మహాసభలను విజయవంతం చేయాలి

You May Have Missed