మిర్యాలగూడ పురపాలక సంఘం ఆధ్వర్యంలో “స్వచ్ఛతా హి సేవా 2026”
ప్రజాలహరి మిర్యాలగూడ (హరిప్రసాద్ చీదళ్ళ)గాంధీ జయంతి ఉత్సవాల్లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పిలుపుమేరకు మిర్యాలగూడ పురపాలక సంఘం ఆధ్వర్యంలో “స్వచ్ఛతా హి సేవా 2026” (Swachhata Hi Seva) విశేష కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా “ఏక్ దిన్, ఏక్ ఘంటా, ఏక్ సాత్” (ఒక రోజు, ఒక గంట, అందరం కలిసి) అనే నినాదంతో పట్టణ పరిధిలో ప్రత్యేక శ్రమదానం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో RDO రమణ రెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ చిలుకూరి సుధ – బాలకృష్ణ ,వైస్ చైర్ పర్సన్ గుడిపాటి శిరీష – నవీన్ కుమార్ మున్సిపల్ కమిషనర్ నర్రా శ్రీజ రెడ్డి,1టౌన్ ci నాగభూషణం,టౌన్ ci సోమ నర్సయ్య పాల్గొన్నార. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్లాస్టిక్ రహిత పట్టణంగా మిర్యాలగూడను తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు”పరిశుభ్రమైన నగరం – హరిత నగరం” (Clean City – Green City) దిశగా ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు ఈ కార్యక్రమంలో పట్టణ కౌన్సిలర్లు, నాయకులు మున్సిపల్ సిబ్బంది, BLR బ్రదర్స్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.



