మిర్యాలగూడ సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో ఘనంగా స్వచ్ఛతాహి సేవ కార్యక్రమం

ప్రజాలహరి మిర్యాలగూడ;మిర్యాలగూడ పట్టణంలోని సోషల్ వేల్పేర్ గురుకుల పాఠశాలలో స్వచ్ఛత హి సేవ కార్యక్రమం వైభవంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా మున్సిపల్ చైర్‌పర్సన్ చిలుకూరి సుధా – బాలకృష్ణ ,వైస్ చైర్‌పర్సన్ గుడిపాటి శిరీష – నవీన్ కుమార్ ,మున్సిపల్ కమిషనర్ నర్రా శ్రీజ రెడ్డి ,హాజరయ్యారు.ఈ సందర్భంగా’స్వచ్ఛత హి సేవ’ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ, మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు.పర్యావరణ పరిరక్షణ మరియు స్వచ్ఛత విధానాలను విద్యార్థులు చిన్నతనం నుంచే అలవర్చుకోవాలని, ఇల్లు మరియు పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో భాగస్వాములు కావాలని ప్రసంగించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, మున్సిపల్ అధికారులు, మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

You May Have Missed