మానవ హక్కుల పరిరక్షణ సంస్థ ( HRCCI ) ఉమ్మడి నల్గొండ జిల్లా కమిటీ ఎన్నిక

ప్రజాలహరి మిర్యాలగూడ; (హరిప్రసాద్ చీదళ్ళ);ఉమ్మడి నల్గొండ జిల్లా కమిటీ తెలంగాణ డిప్యూటీ చైర్మన్ లింగంపల్లి చిరంజీవి ఆధ్వర్యంలో కమిటీ వేయడం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ చైర్మన్ డాక్టర్ కిషోర్, మరియు తెలంగాణ మహిళ స్టేట్ సెక్రెటరీ నాగమణి,  ఉమ్మడి నల్గొండ జిల్లా కమిటీని మిర్యాలగూడలోని బీసీ భవన్ లో కమిటీ వేయడం జరిగింది. వీరికి నియామక పత్రం మరియు ఐడి కార్డ్ మరియు శాలువాతో సన్మానించారు. చైర్మన్ డాక్టర్ కిషోర్, లింగంపల్లి చిరంజీవి మాట్లాడుతూ, సామాన్యమైన పేద ప్రజలకు మరియు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించే విధంగా మానవ హక్కుల పరిరక్షణ సంస్థ తోడుంటుంది అని మాట్లాడడం జరిగింది. నల్గొండ మరియు యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ ఉమ్మడి నల్గొండ వర్కింగ్ కమిటీ చైర్మన్ గా కీర్తి అశోక్,  నల్గొండ జిల్లా డిప్యూటీ చైర్మన్ పోగుల యాదయ్య,, నల్గొండ జిల్లా సెక్రెటరీ చేగోండి మహేంద్ర ప్రసాద్ యాదవ్, యాదాద్రి జిల్లా చైర్మన్ వడ్డేపల్లి నరసింహ, డివిజన్లో చైర్మన్లు, నకిరేకల్ డివిజన్ చైర్మన్ జానిగే కృష్ణ ,మిర్యాలగూడ డివిజన్ చైర్మన్గా కనుకుంట్ల నాగరాజు, చౌటుప్పల్ డివిజన్ చైర్మన్గా వడ్డేపల్లి శ్రీనివాస్ ,మిర్యాలగూడ డిప్యూటీ, చైర్మన్గా జీ కృష్ణ మోహన్, మిర్యాలగూడ జనరల్ సెక్రెటరీ  ఆకుల రామయ్య ,నకిరేకల్ డిప్యూటీ చైర్మన్గా భూపతి శ్రీనివాస్, ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్ డాక్టర్ కిషోర్ మరియు తెలంగాణ మహిళా స్టేట్ సెక్రటరీ నాగమణి గ్రూప్ ఇన్సూరెన్స్ మరియు ఐడి కార్డు బహుకరించారు.

You May Have Missed