చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఘన నివాళులు

ప్రజాలహరి మిర్యాలగూడ; (హరిప్రసాద్ చీదళ్ళ)తెలంగాణ వీరనారి, ధీర మహిళ చాకలి ఐలమ్మ  131వ జయంతి సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలోని ఐలమ్మ  విగ్రహానికి రజక సంఘం నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి – BLR మున్సిపల్ చైర్మన్ చిలుకూరి సుధా బాలకృష్ణ , వైస్ చైర్మన్ గుడిపాటి శిరీష నవీన్. పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే BLR మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ చూపిన ధైర్యం, ఆత్మగౌరవం, పోరాట స్ఫూర్తి సమాజానికి ఎప్పటికీ ఆదర్శమని అన్నారు… అణగారిన వర్గాల హక్కుల కోసం ఆమె చేసిన పోరాటం చిరస్మరణీయమని పేర్కొన్నారు. చాకలి ఐలమ్మ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం, ఆత్మగౌరవం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే BLR పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు, వివిధ కుల సంఘాల నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు…

You May Have Missed