చేయూత పెన్షన్ల ఎంక్వయిరీ ప్రక్రియను పరిశీలించిన హాలియా మున్సిపల్ చైర్మన్ చింతల చంద్రారెడ్డి

ప్రజాలహరి హాలియా;తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న చేయూత పెన్షన్ల కార్యక్రమంలో భాగంగా హాలియా పురపాలక సంఘం పరిధిలో నూతనంగా దరఖాస్తు చేసుకున్న పెన్షన్ దారుల ఎంక్వయిరీ ప్రక్రియ కొనసాగుతోంది.ఈ నేపథ్యంలో హాలియా మున్సిపల్ చైర్మన్ చింతల చంద్రారెడ్డి పట్టణంలోని వివిధ వార్డుల్లో జరుగుతున్న పెన్షన్ దరఖాస్తుదారుల ఎంక్వయిరీ ప్రక్రియను పరిశీలించారు. అర్హత కలిగిన దరఖాస్తుదారులను గుర్తించే విధంగా అధికారులు క్షేత్రస్థాయిలో వివరాలను పరిశీలించాలని సూచించారు.చైర్మన్ తో పాటు స్పెషల్ ఆఫీసర్ చింతపల్లి రవీందర్ , సంబంధిత వార్డు ఆఫీసర్లు కలిసి అన్ని వార్డుల్లో నూతనంగా దరఖాస్తు చేసుకున్న పెన్షన్ దారుల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ ఎంక్వయిరీ ప్రక్రియలో పాల్గొన్నారు.ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన ప్రతి దరఖాస్తుదారుడికి పారదర్శకంగా ఎంక్వయిరీ ప్రక్రియ నిర్వహించాలని అధికారులకు తెలిపారు.

You May Have Missed