అర్హులైన 52 మంది లబ్ధిదారులకు రూ.47.65 లక్షల సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

ప్రజాలహరి మిర్యాలగూడ ( హరిప్రసాద్ చీదళ్ల);మిర్యాలగూడ పట్టణంలోని ఎన్ ఎస్పీ క్యాంపు కార్యాలయంలో సోమవారం నియోజకవర్గానికి చెందిన 52 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.47,65,400 విలువైన సీఎం సహాయనిధి (CMRF) చెక్కులను ఎమ్మెల్సీ శ్రీ కేతావత్ శంకర్ నాయక్ గారు లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు మాట్లాడుతూ, ఆర్థిక ఇబ్బందులతో వైద్య చికిత్స పొందుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు సీఎం సహాయనిధి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సీఎం సహాయనిధి అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ సెల్ నల్లగొండ జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి నర్సిరెడ్డి, 25వ వార్డు కౌన్సిలర్ మనోజ్, నాయకులు తలకొప్పుల సైదులు, జవహర్ నాయక్, కొమ్ము దాసు, శ్రీనివాస్, వెంకటరెడ్డి, సురేష్, సేవా నాయక్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

You May Have Missed