రైతు సంఘం జాతీయ మహాసభలకు విశేష స్పందన. రైతు సంఘం జాతీయ నాయకులు జూ లకంటి
ప్రజాలహరి మిర్యాలగూడ ;నవంబర్ 15 నుండి 18 వరకు నల్గొండ జిల్లా కేంద్రంలో జరుగు రైతు సంఘం జాతీయ మహాసభలకు రైతుల నుండే కాక మధ్యతరగతి వర్గం నుండి పారిశ్రామికవేత్తల నుండి విశేష స్పందన ఉందని రైతు సంఘం జాతీయ నాయకులు జూలకంటి రంగారెడ్డి తెలిపారు. మంగళవారం మిర్యాలగూడ మండలం గూడూరు గ్రామంలో రైతులను కలిసి మహాసభల గురించి వారికి వివరించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ దేశానికి వెన్నుముకైనా రైతుకు నానాటికి పాలకుల విధానాల వల్ల కష్టాలు వస్తున్నాయని వాటిని ఎదుర్కునేందుకు జాతీయ మహాసభలు దోహదపడతాయన్నారు. మహాసభలకు దేశంలోని వివిధ రాష్ట్రాల రైతు ప్రతినిధులు హాజరుకానునట్లు వారు తెలిపారు. దేశంలోని ఆయా రాష్ట్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై సుదీర్ఘమైన చర్చ జరగనున్నట్లు వారన్నారు. మహాసభల్లో జాతీయ నాయకులు పాల్గొంటున్నారని వారు రైతు సమస్యలపై మాట్లాడి వాటికి పరిష్కారం అయ్యే విధంగా ఉద్యమాలకు రూపకల్పన చేయనున్నట్లు వారు తెలిపారు. మహాసభలకు రైతులు స్వచ్ఛందంగా తమకు తోచిన ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారని, అదేవిధంగా 15న నల్లగొండ పట్టణంలో జరిగే బహిరంగ సభకు ఇంటికో వ్యక్తి గ్రామానికి ఒకఎడ్ల బండిలో రావడానికి సిద్ధంగా ఉన్నట్లు వారు తెలిపారు. తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు గూడూరు గ్రామంలో బుధవారం నాడు జరగనున్నాయని ఆ వారోత్సవాల్లో రైతు సంఘం జాతీయ కార్యదర్శి విజ్జు కృష్ణన్ పాల్గొన్నట్టు తెలిపారు. ఈ వారోత్సవాల్లో రైతులు వ్యాపారవేత్తలు మధ్యతరగతి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని జాతీయ నాయకులు రైతుల గురించి ప్రస్తావించే విషయాలను తెలుసుకోవాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి వీరేపల్లి వెంకటేశ్వర్లు, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు రవి నాయక్, పట్టణ సిపిఎం కార్యదర్శి మల్లు గౌతమ్ రెడ్డి, గూడూరు గ్రామ రైతులు పాల్గొన్నారు.



