256 మంది లబ్ధిదారులకు రూ.1.30 కోట్ల విలువైన CMRF చెక్కుల పంపిణీ.. MLA -BLR
ప్రజాలహరి మిర్యాలగూడ; మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి – BLR అన్నారు.ఈరోజు మిర్యాలగూడ పట్టణంలోని MLA క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి – BLR చేతుల మీదుగా నియోజకవర్గానికి చెందిన 256 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.1 కోటి 30 లక్షల 50 వేల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే BLR గారు మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ఎంతో అండగా నిలుస్తోందని అన్నారు.ముఖ్యంగా అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ప్రభుత్వం CMRF ద్వారా ఆర్థిక సహాయం అందిస్తూ భరోసా కల్పిస్తోందని తెలిపారు.ప్రజలకు అవసరమైన సమయంలో ప్రభుత్వం అండగా ఉంటుందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.నియోజకవర్గ అభివృద్ధితో పాటు ప్రజల సంక్షేమానికి తన వంతు కృషి నిరంతరం కొనసాగిస్తానని స్పష్టం చేశారు.అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సహాయ కార్యక్రమాలు చేరేలా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, సర్పంచులు, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు…



