తెలంగాణ సాయుధ పోరాటానికి వారసులు కమ్యూనిస్టులే సిపిఐ బంటు
ప్రజాలహరి మిర్యాలగూడ;భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మిర్యాలగూడ మండలం యాదగిరి పల్లి గ్రామంలో అమరవీరుల స్థూపం దగ్గర వారికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ భూమికోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం తెలంగాణ రైతన్న సాయుధ పోరాటాలు కొనసాగినవి. ఆ పోరాటంలో 10 లక్షల ఎకరాల పొలాలను రైతులకు పంచిన ఘన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఉందని వారన్నారు. ఆనాడు నైజామును తరిమికొట్టిన ఘనమైన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీకి ఉన్నదని వారన్నారు. తెలంగాణ రైతాంగ పోరాట చరిత్రను వక్రీకరిస్తుందని వారన్నారు. సాయుధ పోరాటం నడిచినప్పుడు బిజెపి పార్టీ నామకరణం కూడా జరగలేదని, కేవలం వాళ్లు కావాలని ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని,వాళ్లు ఇప్పటికైనా చరిత్రని చరిత్ర లెక్కనే ఉంచాలి తప్ప చరిత్రని వక్రీకరించొద్దని వారికి ఈ సందర్భంగా హెచ్చరించినారు. సాయుధ పోరాటాల వారోత్సవాలను భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీన గుండ్రంపల్లిలో మొదలై నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలలో 17 తారీకు వరకు సాయుధ పోరాటాల వారోత్సవాలను నిర్వహిస్తున్నామని వారన్నారు. సాయుధ పోరాట యోధులకు ఈ పోరాటంలో అమరులైన నాలుగు వేల 500 మంది అమరులైనరని వారి త్యాగాలు వృధా కాకుండా వారి అడుగుజాడల్లో కమ్యూనిస్టు పార్టీలు నడుచుకుంటూ ప్రజల్లోకి తీసుకొని పోయి ప్రజా పోరాటాలు నిర్వహించాలని వారన్నారు.సీపీఐ ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులకు వారసులు కమ్యూనిస్టులేనని సిపిఐ పార్టీ నల్లగొండ జిల్లా కార్యవర్గ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు అన్నారు.



