ఉప్పల్ బాగాయత్‌లో ఆర్యవైశ్య మహాసభ భూమి పూజకు ముహూర్తం ఖరారు
ఉప్పల్ బాగాయత్‌లో ఆర్యవైశ్య మహాసభ భూమి పూజకు ముహూర్తం ఖరారు
ప్రజాలహరి / మిర్యాలగూడ( హరి ప్రసాద్ చీదళ్ళ);తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభకు ఉప్పల్ బాగాయత్‌లో ప్రభుత్వం కేటాయించిన 5 ఎకరాల స్థలంలో భూమి పూజ కార్యక్రమానికి ముహూర్తం ఖరారైంది.సెప్టెంబర్ 13, ఆదివారం ఉదయం 8 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ భూమి పూజ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగనుంది.ఈ 5 ఎకరాల ప్రాంగణంలో బాలికల వసతి గృహం,తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ, ప్రధాన కార్యాలయం (పరిపాలన భవనం,) కల్యాణ మండపం, వసతి గృహం, నిర్మించనున్నట్లు, మిగిలిన స్థల వినియోగంపై వివిధ వర్గాల అభిప్రాయాలను సేకరించి, అందరితో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని నిర్వాహకులు తెలిపారు.చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ భూమికి ఇప్పటికైనా భూమి పూజ నిర్ణయం తీసుకోవడం పట్ల ఆర్యవైశ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే భవన నిర్మాణాలు పూర్తి చేసి, ముఖ్యమంత్రి చేతుల మీదుగానే ప్రారంభోత్సవం జరపాలని వాసవి మాతను ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రంలోని ఆర్యవైశ్య బంధువులందరూ హాజరై విజయవంతం చేయాలని కోరుతున్నామని పట్టణ ఆర్యవైశ్య సంఘం, మిర్యాలగూడ ప్రతినిధులు భార్గవ్ తిరునగరు, లకుమారపు పాండు రంగయ్య, చిల్లంచర్ల శ్రీనివాస్, అల్లాని రమేష్, జయిని రాములు, గుండా నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు.
జై వాసవి… జై జై వాసవాసవి



