4 నెలల్లో 23వ ఉరి శిక్ష.. వెనక్కి తగ్గని జడ్జి.
ప్రజలహరి మిర్యాలగూడ;4నెలల్లో 22 మందికి మరణశిక్ష విధించి సంచలనం రేపిన UP జడ్జి రవికుమార్ మరోసారి వార్తల్లో నిలిచారు. 2018లో భార్యకు నిప్పు పెట్టి చంపిన కేసులో నిందితుడు నదీమ్ (38)కి తాజాగా ఉరిశిక్ష విధించారు. ఇటీవల ఆయన తీర్పులకు భయపడి 100 కేసులను అధికారులు బదిలీ చేశారు. ఈ క్రమంలో తన సూత్రాలను పాటించినంత కాలం సర్వీసులో ఉంటానని, జడ్జి ఛైర్లో ఉన్నప్పుడు కేసులపై నిర్ణయాధికారం తనకు మాత్రమే ఉంటుందని రవికుమార్ అన్నారు.



