దామరచర్లలో ఆశా కార్యకర్తలు భారీ నిరసన

ప్రజాలహరి మిర్యాలగూడ;దామరచర్ల మండల కేంద్రంలోని ఎనిమిదో తారీఖున ఆశ కార్యకర్తల సమస్యల పైన చలో హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా ఇందిరా పార్క్ కు పోవడం జరిగింది. ప్రభుత్వం మొండివైఖరిగా వ్యవహరించి ఆశా కార్యకర్తలను అనేక రకాల ఇబ్బందుల కు గురి చేసి అక్రమంగా అరెస్టులు చేయటం జరిగింది. ఇది చాలా దురదృష్టకరం ఈ సందర్భంగా సిఐటియు మండల కన్వీనర్ బైరం దయానంద్ మరియు ఆశా జిల్లా అధ్యక్షురాలు డి మహేశ్వరి మాట్లాడుతూ ప్రభుత్వం వారు చెప్పిన విధంగానే ఎన్నికల మేనిఫెస్టో ఆశలకు ఫిక్స్డు వేతనం చెల్లిస్తామని చెప్పారు. అదే రకంగా అనేక రకాలుగా హామీలు ఇవ్వడం జరిగింది. మరీ ముఖ్యంగా కనీస వేతనం 18000 రూపాయలు ఇస్తామని అన్నారు. వారికి పని భద్రత కల్పిస్తామని, చనిపోయిన వారికి 50 లక్షల రూపాయలు ఇస్తామని, అదేవిధంగా ఇన్సూరెన్స్ కల్పిస్తామని, అనేక రకాలుగా వాగ్దానాలు చేసినారు. ప్రభుత్వం గెలిచి వచ్చిన తర్వాత దాదాపు మూడు సంవత్సరాలు కావస్తున్నప్పటికీ ఆశా ల పట్ల ఇంతవరకు ఎటువంటి హామీలు కూడా ఇవ్వలేదు. కనీసం ఈ అసెంబ్లీ సమావేశాలలోనైనా ప్రకటిస్తారేమోనని ఆశ తోటి తొమ్మిదవ తారీఖున చలో హైదరాబాద్ ఇందిరాపార్క్ దగ్గర మీటింగ్ అని వస్తే కనీసం ఆడవారు అని కూడా చూడకుండా నానా రకాలుగా ఇబ్బందులు పెట్టి నానా రకాల పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం జరిగింది. అందుకు నిరసనగా దామచర్ల మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో సిఐటియు మండల కన్వీనర్ బైరం దయానంద్, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు మహేశ్వరి, సిఐటియు దామరచర్ల ఉపాధ్యక్షులు ఎస్కే సుభాని, ఆశా వర్కర్ యూనియన్ సభ్యులు ఉమా, శ్రీదేవి కవిత పద్మ రమణకుమారి తదితరులు పాల్గొన్నారు.

Previous post

శుభకార్యాల పేరుతో హిజ్రాలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే, బలవంతంగా డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు అట్టి వారిపైన చట్టపరమైన చర్యలు తప్పవు మిర్యాలగూడ పోలీసుల హెచ్చరిక.

Next post

4 నెలల్లో 23వ ఉరి శిక్ష.. వెనక్కి తగ్గని జడ్జి.

You May Have Missed