మిర్యాలగూడ నియోజకవర్గానికి అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల, స్కిల్ డెవలప్మెంట్ కాలేజీ మంజూరు చేయాలి
ప్రజాలహరి మిర్యాలగూడ;అసెంబ్లీలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (BLR) డిమాండ్ చేస్తూ ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి (BLR) మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజల తరఫున పలు కీలక అంశాలను ప్రస్తావించారు… మిర్యాలగూడ నియోజకవర్గంలోని రైతులు, విద్యార్థులు, నిరుద్యోగ యువత భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని , నియోజకవర్గానికి అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల తో పాటు స్కిల్ డెవలప్మెంట్ కాలేజీ ని మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు… వ్యవసాయ ఆధారిత ప్రాంతమైన మిర్యాలగూడలో అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేయడం ద్వారా రైతు కుటుంబాలకు చెందిన విద్యార్థులకు వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నూతన పద్ధతులపై విద్య అందే అవకాశం కలుగుతుందని ఎమ్మెల్యే BLR పేర్కొన్నారు… అదేవిధంగా, నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు స్కిల్ డెవలప్మెంట్ కాలేజీ ఎంతో అవసరమని అసెంబ్లీ వేదికగా స్పష్టం చేశారు…
,



