చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

ప్రజాలహరి మిర్యాలగూడ;తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు.తెలంగాణ స్ఫూర్తి ప్రదాత చాకలి ఐలమ్మ వర్ధంతిని ఘనంగా నిర్వహించాలని మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి (BLR) ఆదేశాలు జారీ చేశారు… ప్రస్తుతం శాసనసభ సమావేశాల్లో పాల్గొంటున్నందున, వారి సూచనల మేరకు మిర్యాలగూడ కాంగ్రెస్ నాయకులు, కౌన్సిలర్లు కార్యక్రమాన్ని నిర్వహించారు… ఈ సందర్భంగా MLA గారి తనయులు యువ నాయకులు బత్తుల ఈశ్వర్ గణేష్ తో కలిసి మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ చిలుకూరి సుధా బాలకృష్ణ , పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మౌయిజ్ , కోడిరెక్క ఇంద్ర కుమార్ తో పాటు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పట్టణంలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు… ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, చాకలి ఐలమ్మ తెలంగాణలో సామాజిక న్యాయం, ఆత్మగౌరవం కోసం సాగిన పోరాటానికి ప్రతీకగా నిలిచిన వీరనారి అని కొనియాడారు… అణగారిన వర్గాల హక్కుల కోసం ఆమె చూపిన ధైర్యం, తెగువ, పోరాట స్ఫూర్తి నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు…తెలంగాణ ప్రజల హక్కులు, ఆత్మగౌరవం కోసం ఐలమ్మ గారు చేసిన పోరాటాన్ని స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఆమె ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని నాయకులు తెలిపారు…ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, నాయకులు, రజక సంఘం నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు…

You May Have Missed