మండలంలో వినాయక చవితి గురించి అవగాహన సదస్సుఎస్సై డి వెంకటేశ్వర్లు
ప్రజాలహరి (వేములపల్లి)నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలోని వేములపల్లి మండల కేంద్రంలో బుధవారం స్థానిక ఎస్సై డి వెంకటేశ్వర్లు వినాయక చవితి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ఉన్నటువంటి వినాయక చవితి విగ్రహాల దగ్గర విద్యుత్ సౌకర్యం కావాలన్న ప్రభుత్వం ఫ్రీగా ఇస్తుందన్నారు. అంతేకాకుండా గ్రామాల్లో వినాయకుని మండపాల దగ్గర 10 గంటల తర్వాత ఎలాంటి మైకులు గాని డీ జైలు పెట్టడానికి ఎలాంటి అవకాశం లేదన్నారు ఒకవేళ పెట్టినట్లయితే లక్ష రూపాయలు జరిమానా విధిస్తూ మూడు నెలల పాటు శిక్ష అనుభవించాలన్నారు. ముఖ్యంగా వినాయకుని మండపాల దగ్గర ఎలాంటి సౌకర్యాలు కావాలన్నా ప్రభుత్వం, ప్రభుత్వ అధికారుల నుంచి సహాయ సహకారాలు అని చెప్పారు. ముఖ్యంగా వినాయకుని మండపాల దగ్గర మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినట్లయితే వారిపై తగిన చర్య తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం నాగార్జునసాగర్ ఎడమ కాలవ పరిధిలో నీరు రావడం లేదు కాబట్టి వినాయకుని నిమజ్జనం చేయడం కోసం అందుబాటులో ఉన్నటువంటి చెరువులలో నిమజ్జనం చేయవలెనని ఆయన అన్నారు. ముఖ్యంగా నిమజ్జనం రోజు ఎక్కడైనా ఎవరైనా డీజే గనుక పెట్టినట్లయితే వారిపై కఠిన చర్య తీసుకుంటూ వారికి లక్ష రూపాయలు జరిమానా విధించడం జరుగుతుందని ఆయన తెలిపారు, ఈ కార్యక్రమంలో స్థానిక ఏఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి, జమీందార్ పాపయ్య పోలీస్ సిబ్బంది, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రజలు పాల్గొన్నారు



