గణేష్ ఉత్సవ కమిటీల నమోదు తప్పనిసరి; ఆర్డీవో మిర్యాలగూడ
ప్రజాలహరి మిర్యాలగూడ;గణేష్ చతుర్థి ఉత్సవాల సందర్భంగా, మిర్యాలగూడ సబ్-కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అన్ని లైన్ శాఖల ప్రతినిధులతో మిర్యాలగూడ ఆర్డీఓ గారు శాంతి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.ఈ సమావేశానికి మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్, మిర్యాలగూడ డివిజన్ తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, డీఎల్పీఓ, విద్యుత్ శాఖ డీఈఈలు, నీటిపారుదల శాఖ డీఈఈలు, మత్స్య శాఖ అధికారులు, అగ్నిమాపక అధికారి, ఎక్సైజ్ అధికారి, ఆర్&బి డీఈఈలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు.



