మిర్యాలగూడ వన్ టౌన్ సిఐ నాగభూషణం రావు గారికి వినతిపత్రం అందజేసిన బిజెపి మిర్యాలగూడ వన్ టౌన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బంటుగిరి కొంగరి వెంకటరమణ
ప్రజాలహరి మిర్యాలగూడ; మిర్యాలగూడ పట్టణం వన్ టౌన్ లోని కళాశాలల వద్ద ఆకతాయిల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. వీరి ఆగడాలకు విద్యార్థిని విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ ఆకతాయిల ఆట కట్టించి వీరి బారి నుండి విద్యార్థిని విద్యార్థులకు ఉపశమనం కల్పించాలని…. మరియు పట్టణంలోని కళాశాలల వద్ద పాఠశాలల వద్ద టెంపుల్స్ వద్ద ఉన్న బెల్ట్ షాపులను నియంత్రించి పట్టణ శివారు ప్రాంతాలైన తాళ్లగడ్డ బోటింగ్ శివాలయం మరియు అగ్రిగోల్డ్ వెంచర్ ప్రాంతాలలో విచ్చలవిడిగా ఓపెన్ ప్రాంతాలలో మద్యం సేవిస్తూ ప్రశ్నించిన వారిని బెదిరింపు చర్యలకు పాల్పడుతూ పట్టణ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న అసాంఘిక శక్తులపై పోలీసు డిపార్ట్మెంట్ వారు ఉక్కు పాదం మోపి వీరి బారి నుండి పట్టణ ప్రజలను కాపాడాలని కోరుతున్నాము….. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యదర్శి చిల్లంచర్ల అభి, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు బంటు యాదగిరి, ఓబీసీ మోర్చా పట్టణ అధ్యక్షులు బొట్టు సోములు, బిజెపి వన్ టౌన్ ఉపాధ్యక్షులు మునగాల శివ, తునికి పాటి శశికాంత్ బాణావత్ సందీప్ తదితరులు పాల్గొన్నారు.



