చెప్పేది బారెడు చేసేది చేసేది ముదిరేడు 6 గ్యారంటీ అమలు చేయడంలో విఫలం

వేములపల్లి( ప్రజాలహరి) తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి1000 రోజులు రావడంతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్టుగా చెప్పుకునేది బారేడు, చేసింది మాత్రం మూరెడు అని గొప్పలు చెప్పుకోవడం తప్ప రాష్ట్రంలో చేసింది ఏం లేదని టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు నామిరెడ్డి కరుణాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించాడు. సోమవారం స్థానిక తాసిల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన నాటి నుండి నేటి వరకు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడంలో పూర్తిస్థాయిలో విఫలమైందని ఆయన ఎద్దేవా చేశారు. . అనంతరం స్థానిక తహసిల్దార్ కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో వేములపల్లి గ్రామ సర్పంచ్ పుట్టల సందీప్, శెట్టిపాలెం గ్రామ సర్పంచ్ సైదులు, వేలపల్లి మాజీ సర్పంచ్ సిరిమల యాదవ్, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు కట్ట మల్లేష్ గౌడ్, కృపాకర్ రావు, పేరాలు గురువారం, వివిధ గ్రామాల నుంచి టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

.

Previous post

మిర్యాలగూడ వన్ టౌన్ సిఐ నాగభూషణం రావు గారికి వినతిపత్రం అందజేసిన బిజెపి మిర్యాలగూడ వన్ టౌన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బంటుగిరి కొంగరి వెంకటరమణ   

Next post

గుర్తు తెలియని వాహనం ఢీ వ్యక్తి మృతి

You May Have Missed